జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతున్నట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతుండ డంతో పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజుల పాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.
మళ్లీ అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్
0
406
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


