వాలంటీర్లు సీఎం జగన్ ట్రాప్‌లో పడ్డారని అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. కడపలో తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన… చంద్రబాబుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం సరైందికాదని తెలిపారు.. అవ్వ తాతలకు పింఛన్‌లు ఇవ్వకుండా పొలిటికల్ డ్రామాలకు వైసిపీ తెరలేపిందన్నారు. కొంతమంది వాలంటీర్లు వైసిపి కోవర్టుల్లా పని చేయడం తగదని, ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. కొంతమంది వాలంటీర్లు టిడిపి పై దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వాలంటీర్లపై చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు.


