సంక్షేమాన్నే నమ్ముకున్న జగన్ గెలిచేనా ?

సహజంగా ప్రభుత్వాల నుంచి ప్రజలు బోలెడు ఆశిస్తారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరుకుంటారు. తిండికి ఠికాణా లేని నిరుపేదల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు రూపొందించాలం టారు. ఇవే కాదు తమ జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటారు. తమ గ్రామం లేదా పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా వ్యవస్థ ఉండాలనుకుంటారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను ప్రభుత్వా లు తీర్చిదిద్దాలని సామాన్య ప్రజలు కోరుకుంటారు. అంటే ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ది రెండిటినీ ప్రజలు కోరుకుంటున్నట్లే. ఇందులో ఏ ఒక్క అంశాన్ని పాలకవర్గాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజలు సహించరు.

స్థూలంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండిటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండూ జోడుగుర్రాలవంటివి. ఈ రెండిటినీ ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోగ లగాలి. అప్పుడే ప్రభుత్వ రథం సజావుగా సాగుతుంది. సదరు రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుంది. అయితే సంక్షేమానికి పెద్ద పీట వేసి అభివృద్ధిని అటకెక్కించినా లేదా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టినా అది మంచి ప్రభుత్వం అనిపించుకోదు. అంతేకాదు సదరు రాష్ట్రంలో అస్త వ్యస్త పరిస్థితులు నెలకొంటాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించుకుని తీరాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి …తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు జగన్మో హన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆశలు పెట్టుకు న్నారు. అయితే తొలిరోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడ లేదన్న ఆరోపణలున్నా యి. సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే అభివృ ద్దిని మాత్రం జగన్మోహన్ రెడ్డి అటకెక్కించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

వివిధ పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో సొమ్ములు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కూడా బటన్ నొక్కితే అంటూ సంక్షేమానికి తమ సర్కార్‌ ఇచ్చిన ప్రాధాన్యాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన. అయితే ఆయన బటన్ నొక్కి…సొమ్ములు విడుదల చేస్తే లబ్ది పొందుతున్న సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అభివృద్ధి సంగతి ఏమిటి అంటున్నారు. సంక్షేమం ఓకే అయితే అభివృద్ధి మాటేమిటని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి నే కాదు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను కూడా జనం నిలదీస్తు న్నారు.

అభివృద్ధిపై జనం నిలదీయడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చాలా తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కొంతమందైతే మీకు అభివృద్ధి కావాలా? అయితే సంక్షేమం విషయం మరిచిపోండి అంటూ తెగేసి చెబుతున్నారు. అలా జగన్ శిబిరం నుంచి ఎదురుప్రశ్నలు రావడంతో ప్రజలు డిఫెన్స్‌లో పడుతున్నారు. కొన్నిసార్లు ప్రజలు రోడ్లు కావాలని అడుగు తుంటే నిధులు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. రోడ్ల కోసం ప్రజలకు ఉపయోగపడే పథకాలను నిలిపి వేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మరో అడుగు ముందు కేశారు. రోడ్లు ఇవాళ కాకపోతే రేపు వేసుకోవచ్చు. వాటికోసం పేదవర్గాలకు అండగా నిలుస్తున్న సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగించాల్సిందే అంటున్నారు. అభివృద్దికి చాలా టైముందంటున్నారు. నిరుపే దలకు పట్టెడన్నం పెట్టే సంక్షేమ పథకాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. మొత్తంమీద జగన్మోహన్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని పూర్తిగా అటకెక్కిం చిందన్న విషయాన్ని ఆయన పార్టీ నాయకులు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బాస్ ఈజ్ ఆల్వే స్ రైట్ అన్నట్లు సంక్షేమమే ముఖ్యం అంటున్నారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్