వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఒకటా రెండా బోలెడన్ని పథకాలకు రూపకల్పన చేసింది. పేదల సంక్షేమమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ఖజానాకు ఖర్చయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పేదవాళ్లకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఆశయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే సంక్షే మాన్నే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ అభివృద్ధి అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ సర్కార్ సంక్షేమంలో భాగమే నవర త్నాలు. కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేకానేక పథకాల్లో అమ్మ ఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద చదువుకునే పిల్లల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వ నేరుగా డబ్బులు జమ చేస్తుంది.పేద కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అమ్మ ఒడి పథకం.
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లులకు ప్రతి ఏడాది 15 వేల రూపాయలు లభిస్తాయి. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు, అమ్మ ఒడి పథకానికి అర్హులు. అయితే విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. లబ్దిదారులకు డబ్బులు లభిస్తాయి. అంటే విద్యార్థులు రెగ్యులర్‌గా స్కూల్ కు లేదా కాలేజ్‌కు వెళ్లాల్సిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దవాళ్లు. అలాంటి ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేద, సామాన్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఖరీదైన రోగాలు వస్తే పరిస్థితి దారుణం గా ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేరు. ఇలాంటి వారికి వరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మిత్ర పథకం.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభ మైన ఆరోగ్య శ్రీ పథకానికి కొనసాగింపే ….ఇప్పటి ఆరోగ్య మిత్ర పథకం. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు. అంతేకాదు రవాణా, భోజన, వసతి సదుపా యాలు కూడా కల్పిస్తారు. ఈ పథకం కింద లక్షలాది మంది పేదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు.
ఆరోగ్యమిత్ర పథకం కింద 1038 కి పైగా వివిధ రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స ఇస్తారు. ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రజారోగ్యాన్ని ప్రాధాన్యంగా చేసుకుని రూపొందించారు. ఈ పథకానికి సంబంధించిన కార్డులను ప్రభుత్వం పేదవారికి జారీ చేస్తుంది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఉచిత చికిత్స తీసుకోవచ్చు. నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ వాహన మిత్ర. ఈ పథకం ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి పది వేల రూపా యలు అందిస్తోంది ప్రభుత్వం. స్వంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులు. మౌలికంగా అన్ని విధాలుగా వాహనదారులను ఆదుకోవడమే వాహనమిత్ర పథకం ముఖ్యోద్దేశం. అంతేకాదు వాహనాల మెయింటెనెన్స్ కు కూడా ఈ పథకం టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వాహనాల ఇన్సూరె న్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల కోసం సొమ్ములు కూడా వాహనమిత్ర పథకంలో లబ్దిదారులకు అందుతాయి.
దేశానికి అన్నం పెట్టే రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకు న్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా పేరుతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది మూడు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతులను రైతు భరోసా పథకం ఆదుకుంది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇండ్లు కట్టే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం పేదలకు సర్కార్ సాయం చేస్తుంది. ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ను అందచేస్తారు. అయితే ఇది సరిపోవడం లేదన్న మాట పేదవర్గాల నుంచి వినిపించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేద వర్గాలకు రాయితీపై మరో 50 బస్తాలను అదనంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణ రాయితీ నుంచి మినహాయించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.


