బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు అందుకున్నారు. ఆదివారం నాడు అద్వానీ ఇంటికి స్వయంగా వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో.. శనివారం (మార్చ్-30) రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి అద్వానీ హాజరుకాలేదు. దీంతో రాష్ట్రపతి స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు. శనివారం నలుగురికి భారతరత్న అవార్డులను అందజేశారు. మాజీ ప్రధా నులు దివంగత పివి నరసింహారావు, దివంగత చౌదరి చరణ్ సింగ్ తో పాటు.. వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత ఎంఎస్ స్వామి నాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కార్పూరీ ఠాకూర్ ల వారసులకు భారతరత్న అవార్డులను అందజేశారు. ఈ ఏడాది ఐదుగు రికి భారతరత్న అవార్డులు ప్రకటించింది.