తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పదవీగండం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ కల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం నుంచి రేవంత్‌రెడ్డిని దింపేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఈ కామెంట్లే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం రేవంత్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోందన్నారు ఏలేటి. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని.. వాటిని అధిష్టానం పెద్దలు సీరియస్‌గా పరిగణిస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే సీఎం రేవంత్ ఏడుసార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణతో వ్యవహరిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారని ఆరోపించారు ఏలేటి. సోనియా ఆదేశాలతో ఇదే విషయంపై మాట్లాడేందుకు డీకే శివకుమార్.. రేవంత్‌కు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదన్నారు. స్వయంగా ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డే చెప్పారని గుర్తు చేశారు ఏలేటి. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పినట్లుగా.. నిజంగానే సీఎం రేవంత్‌రెడ్డికి పదవీ గండం పొంచి ఉందా..! లేదంటే ఇవన్నీ పాలిట్రిక్స్‌లో భాగంగా చేస్తున్న విమర్శలా అన్నది ఉత్కంఠగా మారింది.