అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా.. శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు. ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించానని చెప్పారు. ఏపీలో ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో అడోబ్ సహకారం కోరానన్నారు నారా లోకేష్.