మహారాష్ట్ర ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులో తెలుసా..?

మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసంది. కాగా.. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడేందుకు మొత్తం 7వేల 994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వారిలో 921 మంది నామినేషన్ల పేపర్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ అక్టోబర్‌ 22న ప్రారంభమై 29తో ముగిసింది. అక్టోబర్‌ 30న నామినేషన్‌ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీ.

288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, NCP SP, శివసేనలతో కూడిన ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే.. ఇందులో తొలి ఓటర్లు కేవలం 2శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు కాగా.. 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఈసీ తెలిపింది. శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నారని పేర్కొంది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్