బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ రావును ఈ నెల 4న ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అనతరం జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి హెడ్‌గా ఓ టీంను నియమించారు.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు రిమాండ్
0
232
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -
- Advertisement -


