అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మహాశివరాత్రి తర్వాత రెండు రోజులకు గంగమ్మ తిరణాల మొదలవుతుంది. అమ్మవారి చెంత సాష్టాంగ నమస్కారం చేస్తే సంతానలేమి, అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన భక్తులు చాందినీ బండ్లు కట్టుకుని జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 10న చాగలగుట్టపల్లెలో అమ్మవారి జాగారం, 11న నిండు తిరణాల, అమ్మవారికి సిద్ధలపూజ, సిరిమాను, సర్వదర్శనం, బోనాలు, చాందినీబండ్ల ఊరేగింపు చేస్తారు. 12న అమ్మవారి ఊరేగింపు, గంగ స్నానాలు, అభిషేకాలతో తిరణాల ముగుస్తుంది.
రాయలసీమకే తలమానికం …. గంగమ్మ జాతర
0
332
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


