లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కమలనాథులు.. ఇప్పుడు అదే దారిలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావునూ ఆకర్షిస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్తో వరంగంల్లోని ఆయన ఇంట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ నేతలతో కలిసి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు కిషన్ రెడ్డి. సీతారాంనాయక్ను సాదరంగా బిజెపిలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి-సీతారాంనాయక్ భేటీ ఆసక్తి రేపుతోంది.కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అంటున్నారు బీజేపీ నేతలు. సీతారాం నాయక్ చేరితే మహబూబాబాద్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే జలాగం వెంకట్రావుతో సైతం బీజేపీ మాట్లాడినట్లు సమాచారం.
ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచిన బీజేపీ
0
216
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


