మాజీ మంత్రి హరిరామ జగయ్య ఫైర్….!!

     జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జగయ్య ఫైర్‌ అయ్యారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా.. అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జగయ్య. సీట్ల పంపకం మిత్ర పక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని జోగయ్య తాజా లేఖలో ప్రశ్నించారు. జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా.. అని మండిపడ్డారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు…. పవన్ పరి పాలన అధికారం చేపట్టడమని తెలిపారు. గెలిస్తే పవన్‌ను రెండున్నరేళ్లు సీఎంగా ప్రకటించాలని పేర్కొన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్