అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి జాహ్నవి మృతి

     అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసు కెవిన్ డవేపై ఎలాం టి నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు స్పష్టంచేశారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, న్యాయప రమైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.సీనియర్‌ అటార్నీలతో సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు, జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేని యల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేరని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో అడెరెర్‌పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపద్దనే నిర్ణయంపై ఉండబోదని పేర్కొన్నారు. అయితే పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్ అన్నారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా వ్యాఖ్య లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణాంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. పోలీసు చీఫ్ అడ్రియన్ డియాజ్‌ను అడెరెర్‌ కలిసే అవకాశం ఉంది.

      కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువులకు 2021లో అమెరికా వెళ్లింది. సౌత్‌ లేక్‌ యూనియన్‌లోని నార్త్‌ ఈస్ట్రర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరింది. ఈ ఏడాది జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ గంటకు 119 కి.మీ.ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు సియా టెల్‌ పోలీసు విభాగం తెలిపింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ చులకనగా మాట్లాడు తూ పగలబడి నవ్వారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అవి బయట కొచ్చాయి. ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా పోలీస్​ మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అమెరికా లోనూ దీనిపై వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో పోలీసు అధికారి తీరుపై అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అతడిని సస్పెండ్‌ చేశారు. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్