తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు… ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీ చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ విడుదల చేస్తారు. మే నెలకు సంబంధించి ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు.
రేపటి నుంచే మే నెల దర్శనం టికెట్లు విడుదల
0
582
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


