దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని కార్చిచ్చు దహిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటల్లో ఇప్పటివరకు కనీసం 64 మంది మృతి చెందగా… వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 1100 ఇళ్లు కాలిబూడిదైపోయాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండడంతో మృతు ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతా ల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బల మైన గాలులు, స్వల్ప తేమ పరిస్థితులను దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 43 వేల హెక్టార్ల అడవులు ప్రభావితమైనట్టు చెప్పారు. ఇక తీర ప్రాంత పర్యాటక నగరం వినాడెల్ మార్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని… గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలియజేసింది. చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని దహిస్తున్న కార్చిచ్చు
0
311
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


