దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని దహిస్తున్న కార్చిచ్చు

       దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని కార్చిచ్చు దహిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటల్లో ఇప్పటివరకు కనీసం 64 మంది మృతి చెందగా… వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 1100 ఇళ్లు కాలిబూడిదైపోయాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండడంతో మృతు ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతా ల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బల మైన గాలులు, స్వల్ప తేమ పరిస్థితులను దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 43 వేల హెక్టార్ల అడవులు ప్రభావితమైనట్టు చెప్పారు. ఇక తీర ప్రాంత పర్యాటక నగరం వినాడెల్ మార్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని… గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలియజేసింది. చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్