28.6 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

న్యూఇయర్ కోసం హైదరాబాద్‌లోకి భారీగా మత్తు పదార్థాలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. కొత్త కొత్త ఆఫర్లతో పబ్‌లు, రెస్టారెంట్‌లు, రిసార్ట్స్‌, యువతను ఆకర్షిస్తే… మరో వైపు డ్రగ్స్ ముఠాలు యువతను మత్తులో ముంచెత్తడానికి రంగంలోకి దిగాయి. నగరంలో డ్రగ్స్‌ సరఫరా ఎలా చేయాలో పక్కా ప్రణాళికతో ముఠాలు సిద్ధం అయ్యాయి. పోలీసులు నిఘాను బోల్తా కోట్టి ఏజెంట్ల ద్వారా డ్రగ్స్‌ను కావలసిన వారికి అందిస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా డ్రగ్స్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని ముఠాలు. ఓ వైపు రాష్ట్ర సీఎం స్వయంగా డ్రగ్స్ ను అరికట్టే విధంగా పోలీసులు పని చేయాలని ఆదేశాలు జారీ చేసినా డ్రగ్స్ ముఠాలు మాత్రం పట్టించుకోవట్లేదు..

కొత్త సంవత్సరానికి ఆరంభం పలుకుతూ ఎంజాయ్ చేయడానికి యువత వేడుకలకు సిద్దమైంది. ఫుల్‌గా తాగి ఎంజాయ్‌ చేసే వాళ్ల కంటే ఇప్పుడు డ్రగ్స్‌తో మజా చేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ల సంఖ్యే ఎక్కువవుతోంది. మారుతున్న కల్చర్ తో సంపన్న వర్గాలతో పాటు సామాన్య యూత్‌ కూడా డ్రగ్స్‌కు ఎక్కువగా ఆకర్షితులైతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న.. డ్రగ్స్ ముఠాలు సరఫరా చేయడానికి వీలైన కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఇతర ప్రదేశాల నుంచి అధికంగా మొత్తంలో మాదకద్రవ్యాలు రాజధానికి చేరేలా ముఠాలు పని చేస్తున్నాయి. నగరంలోని పబ్‌లకు, రెస్టారెంట్‌లకు, రిసార్ట్స్‌లకు ఇప్పటికే వీలైన పద్ధతుల్లో సరఫరా చేసేందుకు సిద్ధపడ్డారు. నగరంలో పబ్‌లు, రెస్టారెంట్‌లు కొత్త కొత్త ఆఫర్లతో యూత్‌ను ఆకర్షిస్తూ కిక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

మామూలు సమయంలో డ్రగ్స్‌ ఒక్క గ్రాము రెండు వేల నుండి మూడు వేల వరకు అమ్మే ముఠాలు కొత్త సంవత్సరానికి రూ.8వేల నుండి రూ.10వేల వరకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందుకు ఊదాహరణనే హైదరాబాద్ లోని సెంట్రల్ జోన్ లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేయడం. న్యూయర్ సెలబ్రేషన్స్ కి రూ.7 లక్షల రూపాయాల విలువ చేసే 102 గ్రాముల ఎండిఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు సభ్యులు గల ముఠా మహారాష్ట్ర నుంచి నైజీరియన్ కు చెందిన జ్యో అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్మి సోమ్ము చేసుకునే విధంగా ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు…

నగరంలో న్యూయర్ వేడుకలను పోలీసులు అడ్డుకుంటున్నారని యువత మరోవిధంగా రూటు మార్చుతున్నారు. నగర శివార్లతో పాటు ఇతర రహస్య ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ అయితే ఎంత ఎంజాయి చేసినా తమను ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారు. అలా ఎవరైనా తమకు అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.. పోలీసులు పబ్స్, రెస్టారెంట్స్ సిబ్బంది సమావేశమై డ్రగ్స్ వాడకంపై హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులు కొన్ని ప్రత్యేక టీమ్ లను రంగంలో దించాయి. వీరు కూడా కొత్త సంవత్సరంలో ఎక్కడా డ్రగ్స్ సరఫరా కాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఈ టీమ్ లు పనిచేస్తుంటాయి. పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ లలో టీమ్ లు నిఘా పెడతాయి. అనుమానం వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తాయి

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్