‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ మొదలెట్టిన మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్‌తో సునా హో’ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యహరిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఈరోజు సెట్స్‌పైకి వెళ్లింది. రవితేజ మొదటి రోజు షూట్‌లో చేరాడు. క్యానింగ్ సీన్ 6, షూట్ 34తో షూట్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయనంకా బోస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పకులు: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
DOP: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్