పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది. ఈ చిత్రం ద్వారా ఎంతోమంది నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ డైరెక్టర్ సినిమా తీసినా కూడా తెలుగు నటీనటులనే ఎక్కువగా సినిమాలో తీసుకున్నారు. ఆ కోవలో సీనియర్ ఆర్టిస్ట్ పులిరాజేందర్ కూడా ‘సలార్’లో మంచి పాత్రతో ఆకట్టుకున్నారు.
‘సలార్’ సినిమాతో మంచి గుర్తింపు రావడంపై పులి రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘దశాబ్ద కాలం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. అగ్ర హీరోలందరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు చేశాను. రీసెంట్‌గా సలార్ సినిమాలో ‘నాయక్’ క్యారెక్టర్ చేశాను. ఆ పాత్ర చేసినందుకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ సందర్భంగా సలార్ దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రజెంట్ ‘దేవర’లో నటిస్తున్నాను. ఆ సినిమా కూడా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.


