తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్‌కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, CS శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియచేశారు.
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి
0
309
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


