ఈసారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ ఈవెంట్

దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్‌ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటారన్న పేరు ఉండనే ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జర్నలిస్టుగా మారి ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్‌‌గా, నిర్మాతగా, సంతోషం పత్రిక అధినేతగా, నటుడుగా తనదైన ముద్ర వేసి ముందుకు దూసుకు వెళుతున్నారు.

హీరో నాగార్జున సంతోషం సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి తద్వారా సంతోషం పత్రిక మొదలు పెట్టిన సురేష్ కొండేటి నాగార్జున సలహా మేరకు అవార్డులు కూడా ప్ర‌దానం చేయడం మొదలు పెట్టారు. అలా తెలుగు సినిమాలకు 21 ఏళ్లుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్- 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో సురేష్ కొండేటి భేటీ అయ్యారు. గోవాలో ఎలా గ్రాండ్‌గా జరపాలనే అంశాల గురించి సీఎంతో చర్చించారు. అక్కడి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ ఏడాది జరగబోయే ఫంక్షన్‌కు సంబంధించిన తేదీను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ వేడుకల్లోనే ఓటీటీ అవార్డులు కూడా ప్రదానం చేయనున్నారు. సురేష్ కొండేటి కొన్నేళ్లుగా సౌత్ ఇండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్