పవన్ పై కొడాలి నాని సెటైర్లు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పుడు ఎవరితో ఎందుకు ఉంటారో.. ఎవరితో విడిపోతారో పవన్ కే తెలియదంటూ ఎద్దేవా చేశారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్ ఇంతలా గంతులు వేస్తుంటే.. ఎగురుతుంటే 150 మందిమున్న మేము ఏం చేయాలన్నారు. అయినా కరిచే కుక్క మొరగదు.. మొరిగే కుక్క కరవదు అంటూ పవన్ పై మండిపడ్డారు నాని. ఇక జనసేన టీడీపీ పొత్తుపైన నాని స్పందించారు. టీడీపీ తో కలవబోమని బీజేపీ స్పష్టంగా చెబుతోంది. కానీ పవన్ మాత్రం ఎన్టీఏలో ఉన్నానంటున్నాడు.

 

టీడీపీ పొత్తు అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలని మాజీ మంత్రి అన్నారు. వైసీపీని పవన్ రూపాయి పావలా అని అంటున్నాడు. అంటే అతనే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని ఒప్పుకుంటున్నాడని కొడాలి నాని అన్నారు. ఇక పావలా కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమికి 25 సీట్లు వస్తాయన్నమాట. ఇదే పవన్ మనసులో మాట అయి ఉంటుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు అరెస్టుపై జరుగుతున్న వాదనలపై నాని రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే ఆయన తరపు వాదిస్తున్నారని అన్నారు. అంటే చంద్రబాబును అవినీతి చేశాడు. కానీ అరెస్టు సమయంలో సీఐడీ వాళ్ళు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అంటున్నారని అన్నారు. ఇదే వాదనను సీఐడీ కోర్టుతో పాటు హైకోర్టు సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు వాదిస్తున్నారని నాని అన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్