25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

Chandramukhi2 Trailer: 17 ఏళ్ల తర్వాత పగ తీర్చుకోవడానికి వస్తున్న చంద్రముఖి

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం చిత్ర యూనిట్ ‘చంద్రముఖి 2’ ట్రైల‌ర్ విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్‌లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒక‌టి స్టైలిష్ లుక్ కాగా.. మ‌రోటి వేట్ట‌యా రాజా లుక్‌. ఇక చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగనా ర‌నౌత్ ఒదిగిపోయింది. ఇక బ‌స‌వ‌య్య పాత్ర‌లో స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌బోతున్నారు. సినిమాలోని హార‌ర్‌, థ్రిల్లింగ్, కామెడీ అంశాల‌ను చూపించారు. ప్ర‌తీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెర‌కెక్కించారు. న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం, నేప‌థ్య సంగీతం, ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అల‌రించ‌నున్నాయ‌ని ట్రైల‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతోంది. ‘చంద్ర‌ముఖి 2’తో డైరెక్ట‌ర్ పి.వాసు సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయ‌బోతున్నారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

న‌టీన‌టులు:

రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: పి.వాసు, బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: తోట త‌ర‌ణి, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్‌: క‌మల్ క‌న్న‌న్‌, ర‌వివ‌ర్మ‌, స్టంట్ శివ‌, ఓం ప్ర‌కాష్‌, లిరిక్స్‌: యుగ భార‌తి, మ‌ద‌న్ క‌ర్కి, వివేక్, చైత‌న్య‌ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, దొర‌తి, మేక‌ప్‌: శ‌బ‌రి గిరి, స్టిల్స్‌: జ‌య‌రామ‌న్‌, ఎఫెక్ట్స్‌: సేతు, ఆడియోగ్ర‌ఫీ: ఉద‌య్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, ప‌బ్లిసిటీ డిజైన్‌: ముత్తు, పాయింట‌ర్ స్టూడియో, పి.ఆర్‌.ఒ: యువ‌రాజ్(త‌మిళ్‌), సురేంద్ర నాయుడు – ఫ‌ణి కందుకూరి (తెలుగు).

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్