పుకార్లను నమ్మవద్దు.. ఆ వార్తల్లో నిజం లేదు- వివేక్ వెంకటస్వామి

స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీని వీడుతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ స్పందిస్తూ… ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులతో తాను టచ్ లో లేనని చెప్పారు. ఇటీవల తాను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయని చెప్పారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రెండు రోజులుగా తాను పూణేలో ఉన్నానని తెలిపారు.

ఇదిలా ఉంటే వివేక్ వెంకటస్వామి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నెల 30న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వాటిలో రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్‌ వెంకటస్వామి బీజేపీలో చేరారు. 2021 నుంచి బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్