పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. మూడు నెల‌ల మంత్రిగా ప్రమాణస్వీకారం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డిని ఈరోజు రాజ్​భవన్​లో గవర్నర్​ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో రాష్ట్రమంత్రి వర్గంలో మహేందర్​రెడ్డికి చోటు లభించింది. కేబినెట్​ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈటల రాజేందర్​ను బర్తరఫ్​ చేసినప్పటి నుంచి ఖాళీగా కొనసాగుతూ వస్తున్న స్థానాన్ని నేడు మహేందర్​ రెడ్డి భర్తీ చేశారు. పనిలో పనిగా మంత్రి వర్గ విస్తరణను చేపట్టింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని.. ఆ ఖాళీని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. తాండూర్​లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యే ఫైలట్​ రోహిత్​ రెడ్డికి టికెట్​ ప్రకటించడంతో.. మహేందర్​ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం అభ్యర్థులను ప్రకటించిన రోజునే నిర్ణయం తీసుకున్నారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడంతో.. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తోన్న మహేందర్‌ రెడ్డికి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం నిర్ణయించి మంత్రిగా తీసుకున్నారు.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్