అయ్యో ఎంత కష్టం వచ్చింది.. ఎమ్మెల్యే టికెట్ల కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ప్రదక్షిణలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్​ ఆగస్టు 21న మధ్యాహ్నం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టిక్కెట్లు రావు అని ప్రచారం జరుగుతున్న పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ ​ఎమ్మెల్యే రేఖ నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్​లో ఉన్న మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత నివాసాలకు వెళ్లారు.

తమకు బీఆర్​ఎస్ టికెట్​ కేటాయించాల్సిందిగా విన్నవిస్తూ.. సీఎం కేసీఆర్​ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహిళా కమిషన్​ ఛైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి సైతం కవిత నివాసానికి వచ్చి టిక్కెట్ల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. నర్సాపూర్​కి ప్రస్తుతం మదన్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గ టిక్కెట్టును సునీతా రెడ్డి ఆశిస్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో, ఎవరికి మొండి చేయి చూపుతుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని క్షణాలు వేచి చూడాల్సిందే.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్