భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.. శిలాతోరణం వరకు క్యూ లైన్

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలువు దినం కారణంగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న రెండో శనివారం, నేడు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. గత రెండ్రోజులుగా భక్తులు భారీగా తరలి వస్తుండడంతో కొండపై రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అటు, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోగా, భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. భక్తులు తండోపతండాలుగా వచ్చిన నేపథ్యంలో, టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

నిన్న స్వామివారిని 86,781 మంది భక్తులు దర్శించుకోగా 44,920 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చిందని వెల్లడించారు. ఉడిపి శ్రీపుతిగే మఠానికి చెందిన పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామిజీ ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ వేదపండితులు, ఆలయ అధికారులు పీఠాధిపతికి ఘనస్వాగతం పలికారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్