31.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

కేసీఆర్ సంచలనం నిర్ణయం.. హరగోపాల్‌పై కేసులు ఎత్తివేత

స్వతంత్ర వెబ్ డెస్క్:  పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. హరగోపాల్‌తో పాటు మొత్తం 152 మందిపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో గతేడాది ఆగస్టు 19న నమోదైన ఉపా, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు  కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. కేవలం మావోయిస్టుల డైరీల్లో పేరు ఉందని హరగోపాల్, ఇతరులపై ఉపా కేసు నమోదు చేయడాన్ని ప్రజా సంఘాల నేతలు, విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తక్షణమే హరగోపాల్, మరికొందరిపై నమోదైన ఈ కేసును ఉపసంహరించాలని డీజీపీని ఆదేశించారు.

Latest Articles

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ సమావేశం.. పార్టీ బలోపేతంపై ఫోకస్‌

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్‌( K. Chandrashekar Rao) అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి(Erravalli) లోని కేసీఆర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్