ఒడిశా రైలు ప్రమాద బాధితులకి రూ.10కోట్ల ఆర్థిక సాయం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుకేశ్ చంద్రశేఖర్ ముందుకొచ్చాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అతడు లేఖ రాశాడు. రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నాడు. అక్కడి నుంచే ఆ లేఖను రైల్వేశాఖకు పంపాడు.అయితే ఈ విషయంపై ప్రభత్వం, ప్రజలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తాను వ్యక్తిగతంగా, చట్టబద్ధంగా సంపాదించిన మొత్తాన్ని ఇస్తానని పేర్కొన్నాడు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. “మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తోంది. ఒక బాధ్యతాయుతమైన, మంచి పౌరుడిగా.. రూ. 10 కోట్లను ఆ కుటుంబాలు/పిల్లలు, భావి యువత కోసం ప్రత్యేకంగా వినియోగించే నిధిగా అందిస్తున్నాను. తమ ప్రియమైన వ్యక్తిని/కుటుంబాన్ని పోషించే వారిని కోల్పోయిన వారి చదువుల ఖర్చుల కోసం కేటాయించాలని కోరుతున్నా” అని లేఖలో రాసుకొచ్చాడు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్