స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరో అంశంలో ముందు నిలిచింది. వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో అగ్రభాగానా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హిర్దిప్ సింగ్ పూరి చేతుల మీదిగా తెలంగాణ ప్రభుత్వం తరుఫున మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు అవార్డులను అందించారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే పీఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందించారు.
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో టాప్‌లో తెలంగాణ
0
368
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


