ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆర్టీసి అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. డా. బీఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్ నందు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో నూతన బస్సుల రవాణా వెసులుబాటు, రావాల్సిన నూతన బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సంస్థకు వచ్చిన లాభాలు, వ్యేయం, సంస్థలో చేపట్టిన పలు కార్యాచరణలు, బస్సుల ఓ.ఆర్, ఉద్యోగుల సంక్షేమం, అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాలపై సంస్థ ఎండి సజ్జనార్ అధ్వర్యంలో మంత్రి సమీక్షించారు.

అనంతరం రవాణా శాఖ కార్యాచరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నూతన సచివాలయంలోని సమావేశ మందిరంలో శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన తరుణంలో సాధించిన విజయాలు, రాష్ట్ర రవాణ శాఖ సేవలు, వనరులు, ఆదాయ వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రగతి అంశాలను కార్యాచరణ ప్రణాళికను మంత్రి పువ్వాడ అజయ్ చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు, రవాణా శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి, సంయుక్త రవాణా కమిషనర్‌ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్