నేడు విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ప్రారంభించనున్న సీఎం

స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ప్రారంభించనున్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు ఇప్పటికే సదనానికి చేరుకున్నారు. బుధవారం చండీయాగం నిర్వహించనున్నారు. చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారు. పూర్ణాహుతి అనంతరం సదనాన్ని ప్రారంభిస్తారు. సదనం ప్రారంభోత్సవానికి వచ్చేవారికి అన్నపూర్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున నరేంద్ర కామరాజు భోజన ఏర్పాట్లు చేశారు.

ఈ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. 2017 జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనున్నది. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలోని బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం 18 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్‌ ఐఎఎస్‌ కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్