ఈసారి అనాథ పిల్లలకు అండగా నిలబడిన సోనూసూద్

స్వతంత్ర, వెబ్ డెస్క్: రీల్ నటుడు సోనూసూద్ కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన నుంచి సాయం పొందిన వారు అయితే ఏకంగా గుడి కూడా కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. కొంతమది అయితే సోనూ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కోవలోనే బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించాడు. అందులో 100 మంది పిల్లలు చదువుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సోనూ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం చేశారు. అంతేకాదు కొత్తగా స్కూల్‌ బిల్డింగ్‌ను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తాను కూడా భాగమవుతానని తెలిపారు. అనాథ పిల్లలను కలిసినట్లు వారితో దిగిన ఫొటోలను తన ట్వీట్ చేశారు.దీంతో మరోసారి నెటిజన్లు, ప్రముఖులు సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్