అసలు నరేశ్ ఎవరు.. వాళ్లతో మాకు ఏం సంబంధం: మహేశ్ బాబాయ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేశ్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు గురించి తెలుగు వారందిరికీ తెలిసే ఉంటుంది. పద్మాలయా స్టూడియోస్ బాధ్యతలతో పాటు కృష్ణకు సంబంధించిన అన్ని సినిమాల వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. సొంత బ్యానర్లలో 1970ల్లో నిర్మించిన కృష్ణ ఆల్ టైమ్ హిట్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 31వ తేదీన రి రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు నరేశ్ గురించి యాంకర్ ఓ ప్రశ్న వేయగా అసలు నరేశ్ ఎవరు? ఆయనెవరో మాకు తెలీదని ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ పార్థివదేహం వద్ద మా అబ్బాయి.. మేనల్లుడు ఉన్నారు. నరేష్.. వాళ్ల గొడవల గురించి నేను మాట్లాడను. ఆయన గురించి నన్ను ఏమి అడగవద్దు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటీవల ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం తనను స్వీకరించిందని పవిత్రా లోకేష్ చెప్పారు. ఇప్పుడు మహేశ్ బాబాయ్ మాటలు బట్టి చూస్తుంటే నరేశ్‌కు ఘట్టమనేని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్