స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పిడుగుపాటుకు గురై తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన విరాల ప్రకారం.. వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య (55), అతని కుమారుడు రమేశ్ (25) బిజినపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఓ రైతు వద్ద వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఆదివారం వరి పంటను కోయిస్తున్న సందర్భంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇదే సమయంలో వీరు ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దారుణం.. పిడుగుపాటుకు తండ్రీ కొడుకులు మృతి
0
356
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


