టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. పాల్గొననున్న మాణిక్ రావు ఠాక్రే

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్.. తెలంగాణాలో కూడా అదే తరహాలో విజయాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తోంది.కాంగ్రెస్ నేతలంతా సమైక్యంగా ఉండి.. గెలుపు దిశగా ప్రయాణించేందుకు సిద్దమయింది. ఈ క్రమంలో ఈ నెల 22న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

 

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్