స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ‘ఈ-గరుడ’ పేరుతో ప్రయాణికులకు రేపటి నుండి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులను హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రవేశపెట్టనుంది. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రయాణించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మియాపూర్ లో రేపు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది.
రేపు తెలంగాణలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం
0
565
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


