విషాదం.. నదిలో పడి ఐదుగురు బాలురు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బోతాద్ జిల్లాలోని కృష్ణ సాగర్ లేక్‌లో పడి ఐదుగురు యువకులు మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కృష్ణ సాగర్ సరస్సులో ఈత కొట్టేందుకు ఇద్దరు బాలురు వెళ్లారు. ఈతకొట్టే క్రమంలో వారు మునిగిపోవడం చూసి.. మరో ముగ్గురు పిల్లలు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు కూడా నీటిలో పడి చనిపోయారు. మృతులందరూ పదహారు నుంచి పదిహేడు ఏళ్ల వయసు లోపు వారే కావడం గమనార్హం. బాలుర మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈత రాకుండా సరస్సులోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం నుంచి బయటకు రాలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాదకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్