TS Inter Results |తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల

TS Inter Results |తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్స్(TS Inter Results) విడుదల చేశారు. మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 2.72 లక్షల మంది పాసయ్యారు. 3,80,920 మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 2,56,241 మంది పాసయ్యారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) సూచించారు. ఎంసెట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  జూన్ నాలుగున అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయని తెలిపారు. రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేయండి. https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in

ఈ సారి కూడా అమ్మాయిలదే హవా కొనసాగింది. ఇంటర్ ఫస్టియర్ లో అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 68.68 శాతం. ఇంటర్ ఫస్టియర్ లో అబ్బాయిల పాస్ పర్సెంటేజ్ 54.66 శాతం.

సెకండియర్ లో అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 71.57శాతం. సెకండియర్ అబ్బాయిల పాస్ పర్సెంటేజ్ 55.6శాతం.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. చివరి ప్లేస్ లో మెదక్ జిల్లా నిలిచింది.

సెకండియర్ ఫలితాలలో నారాయణపేట్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. చివరి ప్లేస్ లో ఉన్న మెదక్ జిల్లా ఉంది.

ఫలితాల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కి వెళ్లాలనీ కమీషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ నెల 10 నుంచి 16 వరకు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం అప్లై చేసుకోవాలని వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. మానసిక ధైర్యం కోసం
14416 అనే నెంబర్ కు విద్యార్థులు కాల్ చేయాలని సూచించారు.

Read Also:  కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ చేసిన రేవంత్ రెడ్డి.. ఐదు అంశాలు ఇవే!

Follow us on:  Google News Koo, Twitter

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్