స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భాగ్యనగరంలో బీఆర్ ఎస్ హయాంలో శరవేగంగా రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్ లను, అండర్ పాస్సింగ్ బ్రిడ్జ్ లను నిర్మిస్తూ నగర ప్రయాణికుల రాకపోకలను సుగమం చేస్తున్నారు బల్దియా అధికారులు. దేశంలో మరో ముఖ్య పట్టణంగా హైదరాబాద్ ను నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తుంది బీఆర్ఎస్ సర్కారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో అనేక ఫ్లై ఓవర్ లను బల్దియా అధికారులు నిర్మించారు. తాజాగా, మరో ఫ్లై ఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొచ్చారు. గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు పనులు ముమ్మరం చేశారు బల్దియా అధికారులు. ఈ నేపథ్యంలో 13వ తేదీ నుంచి గచ్చిబౌలి – కొండాపూర్ రాకపోకలు నిలిపివేశారు. 90 రోజులపాటు రాకపోకలు నిషేధిస్తూ సైబరాబాద్ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రోడ్డు వరకు నిర్మించే ఫ్లైఓవర్ తో హైదరాబాదీ వాసుల కష్టాలు తీరనున్నాయి.
శరవేంగా గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లైఓవర్ అభివృద్ధి పనులు
0
611
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


