స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరుస తీపికబుర్లు అందిస్తోంది. మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుధ్ద్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన సీఎం కేసీఆర్.. తాజాగా కల్లు గీత కార్మికులకు శుభవార్త అందించారు. రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికులకు ప్రత్యేక బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం తరపున రూ.5లక్షల బీమా అందనుంది. నేరుగా బాధితుల కుటుంబ ఖాతాలోనే డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గీత కార్మికుల బీమాకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ఎక్సెజ్, ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కల్లు గీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
0
276
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


