స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్తమాతో రంగన్న బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా 2019లో వివేకా హత్య జరిగిన సమయంలో రంగన్న వాచ్‌మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ కేసులో రెండేళ్ల కిందట జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. హత్య విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి బెదిరించాడని రంగన్న తెలిపాడు. దీంతో రంగన్నను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించి ఎర్ర గంగిరెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చారు.
వివేకా హత్యకేసు ప్రత్యక్ష సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
0
365
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


