దేశంలో మే 3 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో మే 3 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్