స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో మే 3 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి.