Pavan Kalyan | దేశాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగిన కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం.. ఆర్థిక పురోగతికి ఇంధనం లాంటిదని తెలిపారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘటిత రంగంలోని కార్మికులు తమ బాధలు వెల్లడించుకొనేందుకు వేదికలు ఉన్నా వారి సమస్యలు ఎన్నో అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయని ఆవేదన చెందారు. కష్ట జీవుల పక్షాన ఎల్లవేళలా జనసేన అండగా నిలబడుతుందని తెలిపారు.
‘చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం.. ఆర్థిక పురోగతికి ఇంధనం’
0
380
Previous article
Next article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


