28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

1) మెగా హీరోల సినిమాలకు మోక్షం ఎప్పుడు..?

మెగా హీరోల సినిమాలకు అడ్డంకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ భారీ, క్రేజీ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ… ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఆమధ్య ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఏమాత్రం బాలేదు అనే ఫీడ్ బ్యాక్ రావడంతో.. లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. అందుకనే విశ్వంభర ఆలస్యం అవుతుంది. మన శంకర్ వరప్రసాద్ గారు కంటే ముందు ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు. జులై 10న రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.

విశ్వంభర్ తర్వాత బాగా ఆలస్యం అవుతున్న మరో మెగా హీరో సినిమా సంబరాల ఏటిగట్టు. సాయిదుర్గ తేజ్ హీరోగా నూతన దర్శకుడు రోహిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లాస్ట్ ఇయర్ దసరాకి ఈ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే.. ఇంత వరుకు ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కథ పై ఉన్న నమ్మకంతో 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. ఇంకా క్లైమాక్స్ షూట్ చేయాల్సి ఉండగా.. బడ్జెట్ పెరిగిపోవడం వలన ఆగిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించకుండానే తేజ్ కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అయితే.. సంబరాల ఏటిగట్టు సమ్మర్ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా కూడా ఆలస్యం అవుతూనే ఉంది. వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు కానీ.. ఇంత వరుకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు. ఈమధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా వరుసగా ప్లాపులు రావడంతో వరుణ్‌ కెరీర్లో వెనకబడ్డాడు. దీంతో కొరియన్ కనకరాజు మూవీ వరుణ్ కి చాలా కీలకం. అయితే.. ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. అలాగే ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టంచిన వైష్ణవ్ తేజ్ ఆతర్వాత నటించిన కొండపొలం, రంగ రంగ వైభవంగ, ఆదికేశవ చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో సరైన సినిమా చేయాలని కథలు వింటూనే ఉన్నాడు కానీ.. ఇంత వరుకు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే పెద్ది కూడా రిలీజ్ డేట్స్ విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నడించింది. ఇప్పుడు జూన్ 4న పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇలా.. మెగా హీరోల సినిమాలు ఆలస్యం అవుతుండడంతో… అడ్డంకులు దాటుకుని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తాయా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్