బీహార్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ లోని షమీర్ పేట రిసార్ట్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరిలో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీహార్ లో కొత్తగా నితిశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఈ నెల 12 బీహార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవల్సి ఉంది.జేడీయూ, బిజేపీ సర్కార్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా, ఆకట్టుకోకుండా ఉండేలా.. కేంప్ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ రిసార్ట్ లో ఉంచుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు స్వాగతం చెప్పారు. అనంతరం షమీర్ పేట లోని ప్రైవేటు రిసార్ట్ కు వెళ్లారు.
హైదరాబాద్ రిసార్ట్ లో బీహార్ ఎమ్మెల్యేలు
0
435
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


