రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో.. వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో.. రాష్ట్రంలోనూ ఇదే తరహా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని సమాచారం. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. 11న ఆదివారం సెలవు. తిరిగి 12 నుంచి బడ్జెట్ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతాయి.
రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
0
284
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


