పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా మాఝీ విజయం సాధించారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌పై గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు కలితా మాఝీ ఇళ్లలో సహాయకురాలిగా పనిచేసేవారు. సాధారణ జీవితంలో నుంచి వచ్చి ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.
గుస్కారా మున్సిపాలిటీకి చెందిన మాఝీ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇళ్లల్లో సహాయకురాలిగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో BJP ఆమెకు సీటు ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అభేదానంద థాండర్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ స్థానికులతో ఆమెకున్న సంబంధాలపై విశ్వాసంతో BJP మరోసారి తాజా ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఈసారి ఆమె తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సాధారణ పౌరులు సైతం ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నిరూపించారు.


