చిరంజీవి, వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అత్యున్నతమైన పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ సంవత్సరం మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలనాటి నటి వైజయంతి మాల బాలి, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌, పద్మ సుబ్రమణ్యంలను పద్మవిభూషణ్‌కు కేంద్రం ఎంపిక చేసింది.

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, నటులు మిథున్‌ చక్రవర్తి, విజయకాంత్‌ తదితరులను పద్మభూషణ్‌ వరించింది. తెలంగాణకు చెందిన ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంగా అవార్డులు దక్కినవారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్‌ మాజీ సీఎం, జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌ (మరణానంతరం)కు ఇటీవల కేంద్రం ప్రకటించింది.

Latest Articles

210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!

  కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్